దామరగిద్ద, ఆగస్టు 6: తమకు న్యాయమైన పరిహారం ఇచ్చే వరకు కొడంగల్ ప్రాజెక్టుకు భూములు అప్పగించేది లేదని రైతులు తెగేసి చెప్పారు. బుధవారం నారాయణపేట జిల్లా దా మరగిద్ద మండలం నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల కానుకుర్తి రిజర్వాయర్ బండ్ (కట్ట) ఎత్తు పెంపుపై సర్వే కోసం అధికారులు రాగా రైతులు అడ్డుకున్నారు.
ముందుగా గ్రామసభలు నిర్వహించి రైతుల అభిప్రాయ సేకరణ చేశాక.. ఎకరాకు రూ.40 లక్షల పరిహా రం, ఇంటికో ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో చేసేది లేక అధికారులు వెనుదిరిగారు.