షాద్నగర్, జూన్ 9 : కాంగ్రెస్ను గద్దె దించితేనే బంజారాల బతుకులు మారతాయని లంబాడా హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాంబల్నాయక్ పేర్కొన్నారు. మంత్రివర్గం లో లంబాడాలకు స్థానం కల్పించకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ .. సో మవారం కాంగ్రెస్, రేవంత్ హఠావో.. బంజారా బచావో అనే నినాదాన్ని ఇచ్చి మాట్లాడారు.
బంజారా ఎమ్మెల్యే, ఎం పీ, ఎమ్మెల్సీలకు ఏమాత్రం పౌరు షం ఉన్నా వెంటనే తమ పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. లంబాడాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా సామాజిక న్యాయం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. లంబాడాలను కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని, తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.