నాంపల్లి క్రిమినల్ కోర్టులు, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): లగచర్ల రైతులపై బొమ్రాస్పేట్ పోలీసులు నమోదు చేసిన కేసు విచారణను హైకోర్టు నాంపల్లి ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇప్పటివరకు సంగారెడ్డి జైలులో వారు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.
ఈ కేసులో నిందితునిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి రెండ్రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో ఆయన బెయిల్‌పై విచారణ ప్రారంభం కానుంది.
ప్రభుత్వానిదే బాధ్యత ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థి సంఘం
రవీంద్రభారతి, డిసెంబర్ 12 : లగచర్ల గిరిజన రైతులకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థి సంఘం రా్రష్ట్ర అధ్యక్షుడు నరసింహనాయక్ హెచ్చరించారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.