హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): కార్మికుల, వినియోగదారుల ధరల సూచిక (కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్)ను ప్రకటిస్తూ కార్మిక శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు.
పరిశ్రమల కార్మికులకు సీపీఐ 1659 నుంచి 1733 (74 పాయింట్లు పెరుగుదల)కు, వ్యవసాయ కార్మికులకు 1260 నుంచి 1302 (42 పాయింట్లు పెరుగుదల)కు పెరిగినట్టు పేర్కొన్నారు. ఈ పెరుగుదల ఈ నెల ఒకటి నుంచి సెప్టెంబర్ 30 వరకు వర్తిస్తుందని, ఈ మేరకు కరువుభత్యం నిర్ణయించాలని కోరారు. కనీస వేతన చట్టం-1948 కింద ప్రతి ఆరు నెలలకోసారి ఈ ధరల సూచికను కార్మికశాఖ ప్రకటిస్తుంది.