హనుమకొండ, నవంబర్ 26 : భారత రాజ్యాంగంతో అందరికి సమాన హక్కులు, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం కల్పించిన మహత్తర పత్రమని బీసీ ఇంటలెక్చువల్స్ఫోరం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కూరపాటి రమేశ్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీసీ ఇంటెలెక్చువల్స్ఫోరం ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జాక్ సంఘాల సహకారంతో సాంవిధాన్ దినోత్సవ వేడుకలను హనుమకొండలోని కూరపాటి హాస్పిటల్స్లో నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు సాంవిధాన పీఠికను చదివి, రాజ్యాంగ విలువలను కాపాడాలని ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం సామాజిక న్యాయం, సమాన అవకాశాల దిశగా దేశాన్ని నడిపే శక్తి, రాజ్యాంగం ప్రసాదించిన ‘ఓటు’ అనే శక్తివంతమైన ఆయుధాన్ని వినియోగించుకుని బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు రాజ్యాధికారాన్ని సాధించేందుకు ముందుకు సాగాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఈ సాంవిధాన్ అవగాహన ఎంతో కీలకమని ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వంటి వెనుకబడిన వర్గాల సాధికారతకు ఈ రాజ్యాంగం బలమైన ఆయుధమన్నారు. కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జాక్ వరంగల్ చైర్మన్ చందా మల్లయ్య, డీఎస్పీ ప్రతినిధి సుమన్, పలువురు సంఘాల ప్రతినిధులు, ముఖ్యనాయకులు పాల్గొన్నారు.