హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): సమ్మె వి షయంలో ప్రభుత్వం, యాజమాన్యం ఆర్టీసీ కార్మికులను రె చ్చగొట్టొద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. హైదరాబాద్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. నర్సంపేట, నల్లగొండలో ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మాహుతి యత్నానికి పాల్పడడం ఆందోళనకరమని పేర్కొన్నారు.
ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు సహనం కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు. సమ్మె విచ్ఛిన్నానికి యాజమాన్యం చర్యలు అప్రజాస్వామికమని పేర్కొన్నారు. . కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని, స మ్మెను విరమింపజేయాలని కోరారు.