హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హోంగార్డ్స్‌ను ఏపీకి, అక్కడ పనిచేస్తున్న వారిని తెలంగాణకు పంపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఏపీ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి రామకృష్ణ కోరారు.
ఈ మేరకు వారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అందులో భాగంగా సీఎంకు వినతి పత్రాన్ని అందజేశారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి నివేదిక తెప్పించుకొని హోంగార్డుల సమస్య పరిష్కరించాలని వారు కోరారు.