హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన నడుస్తున్నదా? లేక బౌన్సర్ల రాజ్యం నడుస్తున్నదా? అంటూ సీపీఐ శాసనసభా పక్షనేత కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. రాష్ట్రం లో భూముల వద్ద బౌన్సర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారని, పలుచోట్ల దౌర్జన్యాలకు దిగుతున్న ఉదంతాలు బయటపడ్డాయని, ఇది సర్కార్ వైఫల్యమేనని ఆరోపించారు.
ఇటీవల 25 మందిపై ఏసీబీ దాడి చేస్తే వేలకోట్లు పట్టుబడటం ఆశ్చర్యపరుస్తున్నదని పేర్కొన్నారు. 22-ఏకు వెంటనే పరిష్కారం చూపాలని కోరారు.