కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ సిలిండర్ల ధరలను రూ.50 పెంచడం.. మూలిగే నకపై తాటి పండు పడ్డట్టు ఉన్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీ సిలిండర్లతో బుధవారం నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడారు. కార్పొరేట్ కంపెనీలకు, బడా పారిశ్రామికవేత్తలకు కేంద్రం రూ.లక్షల కోట్లు రాయితీలిస్తూ, ప్రజల మీద మాత్రం భారం మోపుతున్నదని విమర్శించారు.