హైదరాబాద్, మార్చి26 (నమస్తే తెలంగాణ ) : రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేదే లేకుండా పోయిందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. సామాన్యుడు నిర్భయంగా వెళ్లి కేసు పెట్టే పరిస్థితి లేదని తెలిపారు. బడ్జెట్ పద్దులపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. కొందరు పోలీసులు రాజకీయ నేతలకు బానిసల్లా తయారయ్యారని మండిపడ్డారు. ఆడపిల్ల అర్ధరాత్రి రోడ్డుపై తిరగలేని దుస్థితి నెలకొన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. జర్నలిస్టుల ముసుగులో సోషల్ మీడి యా వేదికగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవారిపై చర్యలు తీసుకోవాలన్నారు.