ఆసిఫాబాద్ టౌన్ ; కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వెంకటాపూ ర్ పరిధిలోని టిమ్రన్ మోవాడ్ బండగూడకు చెం దిన దర్ముబాయికి శుక్రవారం పురిటి నొప్పులు వచ్చాయి. వాగుపై వంతెన లేక ఒడ్డుపైనే అంబు లెన్స్ ఆగింది. 7 నెలల గర్భిణీ దర్ముబాయ్ కిలోమీటరున్నర నడుచి వాగు దాటింది. నొప్పులు తీవ్రం కావడంతో అంబులెన్స్ సిబ్బంది ప్రసవం చేశారు. ఆడ శిశువుకు జన్మనివ్వగా, గర్భంలో మరో శిశువు ఉందని అంబులెన్స్ సిబ్బంది ఆసిఫాబాద్‌లోని ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లగా శిశువు మరణించింది. వైద్యులు మంచిర్యాల మాతా శిశు సంరక్షణ కేంద్రానికి తరలించగా దర్ముబాయి మరో పాపకు జన్మనిచ్చింది. ఆదివాసీ దినోత్సవం రోజే ఆదివాసీ గర్భిణి ప్రసవ వేదన కలిచివేసింది.