ఎల్లారెడ్డిపేట, డిసెంబర్ 26: గంపెడాశతో గల్ఫ్ వెల్లిన ఓ గిరిజన రైతు అక్కడే ప్రాణాలు కోల్పోగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించి స్వగ్రామానికి మృతదేహాన్ని తెప్పించారు. వివరాల్లోకి వెళ్తే.. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుంటపల్లి చెరువుతండా కు చెందిన గుగులోత్ రవి (40)- మం జుల దంపతులకు ముగ్గురు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. పెద్ద కూతురు ఉన్న త చదువులు చదువుతుండగా, రెండో కూతు రు వివాహం జరిపించాడు. దీనికోసం రూ.8 లక్షల వరకు అప్పు చేశాడు. పెద్ద కూతురు స్రవంతి, మూడో కూతురు సోనా, కొడుకు దివాకర్ చదువుతున్నారు.
తనకున్న ఎకరన్నర పొలంలో సాగు చేస్తున్నా.. అప్పు తీరే మార్గంలేక, పిల్లలకు మంచి చదువులు చెప్పించే అవకాశం లేక రవి తల్లడిల్లాడు. ఇక్కడుంటే కష్టమని ఉపాధి కోసం ఏడాది క్రితం రూ.2 లక్షలు అప్పు చేసి సౌదీ వెళ్లాడు. అంతా బా గుందనుకున్న క్ర మంలో ఈ నెల 6న గుండెపోటుతో అక్కడే మృతి చెందాడు. తెలిసిన కుటుంబసభ్యులు మృతదేహాన్ని రప్పించే స్థోమత లేక తల్లడిల్లారు. ఈ విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన ఆయన రవి మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు సహకారం అందించారు. శుక్రవారం రవి మృతదే హం రాగా, బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య బాధిత కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం కల్పించారు.