KTR | వీర్నపల్లి, మే 11: ‘అంజక్కా.. బాగున్నవా.. ఆరోగ్యం ఎట్లుంది?’ అంటూ తెలంగాణ ఉద్యమకారిణి అల్వాల అంజమ్మను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆత్మీయంగా పలకరించారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం శాంతినగర్‌లో బీఆర్ఎస్ నేత జుంకీలాల్ కొడుకు సాగర్-ప్రవళిక వివాహ వేడుకకు కేటీఆర్ హాజరయ్యారు.
కొంతకాలంగా అనారోగ్యానికి గురైన అంజమ్మ కేటీఆర్‌ను చూడగానే ఆలింగనం చేసుకొని భావోద్వేగానికి లోనైంది. ‘నువ్వు.. నా బంగారానివి బిడ్డ. నిన్ను చూడక ఎన్ని రోజులవుతున్నది’ అంటూ కన్నీరు పెట్టుకున్నది. ‘బాపు పానం బాగున్నదా.. అమ్మ, పిల్లలు ఎట్లున్నరు?’ అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ఆప్యాయంగా ఆరా తీసింది. గతంలో తన పాణం బాగా లేకుంటే బాపు పైసలు పంపించిండు అంటూ కేసీఆర్ చేసిన సహాయాన్ని గుర్తుచేసుకున్నది.
అంజక్క బాగున్నావా.. ఆరోగ్యం ఎట్లుంది!
ఉద్యమ నాయకురాలితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS ఆత్మీయ పలకరింపు 🩷
🔹తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ గారి వెన్నంటి నడచిన మహిళ నాయకురాలు
🔹ఊరు ఎంటర్ కాగానే అంజక్క బాగుందా అని స్థానిక నాయకులను క్షేమ సమాచారం అడిగిన రామన్న
🔹అనుకోకుండా… pic.twitter.com/aCw2mt3opH
— BRS Party (@BRSparty) May 11, 2025
మీ వల్లే మా బాబు దక్కిండు సార్.. అల్మాస్పూర్లో కేటీఆర్‌కు ముక్క బాల్‌రాజు కృతజ్ఞతలు
ఎల్లారెడ్డిపేట, మే 11: ‘సార్.. మీ వల్లే మా బాబు మాకు దక్కిండు. గుండె చికిత్సకు మీరందించిన సాయం మరువలేను’ అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లికి చెందిన ముక్క బాల్‌రాజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. బాల్‌రాజు-కల్పన దంపతులకు ఐదు నెలల క్రితం బాబు(భరత్‌కుమార్) జన్మించాడు. అతనికి పుట్టుకతోనే గుండెకు రంధ్రం ఉన్నదని, మందులతో తగ్గుతుందని వైద్యులు చెప్పారు. కానీ, మూడు నెలలైనా తగ్గకపోగా, సమస్య పెద్దదై, శ్వాస ఇబ్బంది ఏర్పడింది. దీంతో బాబును మార్చి 7న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. ఆపరేషన్‌కు రూ.8 లక్షలు అవుతుందని వైద్యులు చెప్పడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో బాలుడి తల్లికి బంధువైన అల్మాస్‌పూర్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకులకు తమ పరిస్థితిని తెలియజేయగా, వెంటనే వారు కేటీఆర్‌కు సమాచారం ఇచ్చారు. కేటీఆర్ వెంటనే స్పందించి బాలుడి ఆపరేషన్‌కు సాయం అందించే ఏర్పాటు చేశారు. శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తికావడంతో కుటుంబ సభ్యులు ఇటీవలే అక్కపల్లికి చేరుకున్నా రు. కేటీఆర్ ఆదివారం అల్మాస్పూర్ రేణుకాదేవి ఆలయానికి వస్తున్నట్టు సమాచారం తెలియడంతో బాల్‌రాజు వచ్చి ఆయనను కలిశారు. ‘మీ వల్లే మా బాబు దక్కిండు సార్. మిమ్మల్ని ఎప్పటికీ మరిచిపోలేమంటూ’ కృతజ్ఞతలు తెలియజేశారు.