Minister KTR | మనోహరాబాద్, నవంబర్ 1: హైదరాబాద్ నుంచి కామారెడ్డి వెళ్తున్న మంత్రి కేటీఆర్ వాహనాన్ని మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద పోలీసులు, ఎన్నికల సిబ్బంది ఆపి తనిఖీ చేశారు.
బుధవారం హైదరాబాద్ నుంచి కామారెడ్డికి వెళ్తున్న సమయంలో కేటీఆర్ వాహనాన్ని ఆపి తనిఖీలు నిర్వహించారు. వాహన తనిఖీకి కేటీఆర్ పూర్తిగా సహకరించారు. తనిఖీ పూర్తయ్యే వరకు కారు దిగి వేచి చూశారు. అనంతరం కామారెడ్డి బయల్దేరారు.