నాంపల్లి కోర్టులు, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసుపై నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు శనివారం విచారణ జరుపనున్నది. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్‌తోపాటు సాక్షులుగా ఉన్న తుల ఉమ, బాల్క సుమన్, దాసోజు శ్రవణ్, సత్యవతి రాథోడ్ల వాంగ్మూలాలను నమోదు చేసిన కోర్టు.. కేటీఆర్ పిటిషన్‌పై మంత్రి సురేఖ వివరణను కోరనున్నది. ఆమె కౌంటర్‌పై ఇరు వర్గాల వాదనలు పూర్తయ్యాక కోర్టు తన తీర్పును వెల్లడించనున్నది. మంత్రి సురేఖపై సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కోర్టు తీర్పు ఈ నెల 28కి వాయిదా పడిన తెలిసిందే.