KTR | కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు చెప్పారు. తెలంగాణ రైతుల దీనస్థితిని ఎత్తిచూపిన నిర్మలకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో 30 శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదని ఆరోపించారు. అన్నదాతల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, రైతుబంధు విడుదల చేయడం లేదని విమర్శించారు. దశాబ్దం తర్వాత తెలంగాణ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారని తెలిపారు. అయినప్పటికీ తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం సీఎంకు వ్యక్తిగత సిబ్బందిలా పని చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు మద్దతుగా ఒక మాట కూడా మాట్లాడటం లేదని మండిపడ్డారు.