హైదరాబాద్ : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గురువారం లేఖ రాశారు. పురపాలక, పట్టణాభివృద్ధి పనులకు నిధులు ఇవ్వాలని లేఖలో కోరారు. కేపీహెచ్‌బీ-కోకాపేట-నార్సింగ్ కారిడార్ ఎమ్మార్పీఎస్‌కు, ఎమ్మార్టీఎస్ ప్రాజెక్టు వ్యయంలో 15శాతం, రూ.450కోట్లు మంజూరు చేయాలని కోరారు. వరంగల్ మెట్రో నియో ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలన్నారు. ప్రాజెక్టు వ్యయంలో 20శాతం మంజూరు చేయాలని, రాష్ట్రంలో మెట్రో నియో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటును పరిశీలిస్తున్నామన్నారు.
హైదరాబాద్, పరిసరాల్లో లింక్ రోడ్లకు నిధులివ్వాలని, మొత్తం 104 కారిడార్లకు రూ.2400 కోట్లు అవుతుందని పేర్కొన్నారు. లింక్‌రోడ్ల వ్యయంలో మూడోవంతు ఇవ్వాలని, ఎస్ఆర్డీపీకి నిధులు ఇవ్వాలని కోరారు. పార్యడైజ్ – శామిర్‌పేట ఆరులైన్ల కారిడార్‌కు, మూసీ వెంట తూర్పు – పశ్చిమ అనుసంధానికి, ప్యారడైజ్ – కండ్లకోయ ఆరులైన్ల కారిడార్‌కు నిధులు ఇవ్వాలన్నారు. ఎస్ఆర్డీపీ రెండో దశకు రూ.14వేలకోట్లు, హైదరాబాద్‌లో నిర్మిస్తున్న ఎస్టీపీలకు నిధులు ఇవ్వాలని, ఎస్టీపీల వ్యయం రూ.8684 కోట్లలో మూడోవంతు ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.