సింగపూర్ : సింగపూర్‌లో ఓ వృద్ధుడు(97) 50 ఏండ్ల నిరీక్షణ తర్వాత తన గర్ల్‌ఫ్రెండ్‌ను పెండ్లి చేసుకోనున్నారు. వృద్ధుడికి 1950లో పెండ్లయ్యింది. అయితే 1971లో అతడు తన కార్యదర్శితో ప్రేమలో పడ్డాడు. 2014లో తన భార్య చనిపోయిన తర్వాత 2016లో తన ప్రియురాలిని తన ఇంటికి తీసుకొచ్చి ఆమెతో కలిసి జీవిస్తున్నాడు. 2021లో వారిద్దరూ పెండ్లి చేసుకోవాలనుకున్నారు.
అయితే తన తండ్రికి చిత్త వైకల్యం ఉందని, ఆయన ప్రియురాలు ఆయన ఆస్తి కోసమే పెండ్లికి ఒప్పుకొందని వృద్ధుడి కుమారుడు కోర్టులో కేసు వేశాడు. అయితే వైద్య పరీక్షల ప్రకారం వృద్ధుడు ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపిన కోర్టు వారిద్దరి 50 ఏండ్ల సంబంధాన్ని మోసమని పేర్కొనడం సరైంది కాదని తీర్పు ఇచ్చింది.