మొయినాబాద్, జూలై 11 : జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధి హిమాయత్‌నగర్‌లోని తన నివాసంలో ఉన్న రాజేశ్వర్‌రెడ్డిని శుక్రవారం కేటీఆర్ పరామర్శించడంతో పాటు రాజేశ్వర్‌రెడ్డి పుట్టినరోజు ఉండటంతో శుభాకాంక్షలు చెప్పారు.
కాలు ఫ్రాక్చరై ఇంట్లో మెడికేషన్‌లో ఉన్న రాజేశ్వర్‌రెడ్డి తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయనతోపాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కొంపల్లి అనంతరెడ్డి, మండల అధ్యక్షుడు దారెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు జయవంత్, మాజీ ప్రధాన కార్యదర్శి నరసింహగౌడ్, మాజీ సర్పంచ్ శ్రీహరియాదవ్ ఉన్నారు.