హైదరాబాద్, సెప్టెంబర్ 21(నమస్తే తెలంగా ణ): అమృత్ పథకంలో సీఎం రేవంత్రెడ్డి అవినీతికి పాల్పడినట్టు కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మా ట్లాడుతూ అమృత్ పథకం కింద రూ. 8,888 కోట్ల అవినీతి జరిగిందని బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టెండర్లపై తాను ఏ కం పెనీని బెదిరించలేదని స్పష్టం చేశారు. తాను రాజకీయాలకు రాక ముందే కాంట్రాక్టర్నని, ఎవరికీ భయపడబోనని పేర్కొన్నారు. ఆరోపణలను కేటీఆర్ నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, లేదంటే ఆయన తన ఎమ్మె ల్యే పదవికి రా జీనామా చేయాలని సవాల్ విసిరారు.