KTR | హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): ‘నీ పిల్లి కూతలకు భయపడేటోళ్లు.. నీ తాటాకు చప్పుళ్లకు వణికేటోళ్లు ఎవరూ లేరిక్కడ.. ఉద్యమాల పిడికిలి ఇది.. గుర్తుపెట్టుకో మీ తాట తీసేందుకే వచ్చిన’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. మంగళవారం తన కాన్వాయ్‌పై కాంగ్రెస్ నాయకులు దాడి చేసిన నేపథ్యంలో రేవంత్‌రెడ్డికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ‘బడుగు, బలహీనుల గొం తులను నీ బుల్డోజర్లు తొకిపెట్టలే వ్.. గూండా రాజ్యాన్ని, నియంతృత్వ పాలనను సవాల్ చేసే నా స్ఫూర్తిని నీ గూండాలు ఆపలేరు’ అంటూ విరుచుకుపడ్డారు. ‘నీ గుండాలు నా వాహనం పై చేసిన దాడి నాకు మరింత శక్తినిస్తుంది’ అని ఇలాంటి వాటితో తనను ఆపలేరని కేటీఆర్ స్పష్టంచేశారు. ‘సీఎంకూల్చిన ఇండ్ల శిథిలాల్లో బాధితులు తమ జీవితాలను వెతుక్కుంటున్నా రు. ఇప్పుడు మీ మంత్రులను వచ్చి చెప్పుమనండి.. వీళ్లు కూడా డబ్బులు తీసుకున్నారని! మీరొచ్చి ఆ చిట్టి తల్లులకు చెప్పం డి.. మీ ఇం డ్లు కూల్చి, మాల్స్ కడుతున్నం, మీ బతుకులు బాగుపడతాయని.. ఇదేనా మీరు చెప్పిన ప్రజాపాలన’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఎవర్ని ఫూల్ చేస్తున్నారు రాహుల్?
అదానీ, బుల్డోజర్ విషయంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎవరిని ఫూల్ చేస్తున్నారంటూ కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. మంగళవారం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ ‘అదానీతో ఢిల్లీలో నీది కుస్తీ, దావోస్‌లో రేవంత్ దోస్తీ! ఎవరు రైట్? ఎవరు రాంగ్?’ అంటూ నిలదీశారు. ‘బుల్డోజర్ రాజ్ యూపీలో తప్పు.. హైదరాబాద్‌లో ఒప్పా?.. ఫిరాయింపులపై హిమాచల్‌లో నీతులు.. తెలంగాణలో గోతులు! ఇలా ఒకే అంశంపై ఒకే వైఖరి ఉండదా మీ దికుమాలిన పార్టీకి? ’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ప్రజలకు దసరాలా లేకపాయె
‘ఢిల్లీకి చకర్లు కొడుతున్న సీఎం రేవంత్‌రెడ్డికి తెలంగాణ గల్లీల్లో తిరిగి చూసే ఓపిక లేదా?’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఏకంగా 23 సార్లు హైద్రాబాద్ ఢిల్లీకి తిరిగారని కా నీ గల్లీలో మాత్రం తిరగడం లేదని దుయ్యబట్టారు. ఐదు లక్షలమంది రైతులు రెండు లక్షల రుణమాఫీ కోసం, 67 లక్షల మందికి రైతన్నలు రైతుబంధు కోసం ఎదురుచూస్తున్నారని, వ్యవసాయ శాఖ నిర్లక్ష్యంతో 43 ల క్షల మంది పత్తి రైతులు దళారుల చేతిలో ద గాపడి అల్లాడుతున్నారని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘రైతు వ్యతిరేక పాలన పుణ్యమా? అని ఈ సారి తెలంగాణ ప్రజలకు దసరాలానే లేకపాయె’ అంటూ వాపోయారు.