చిగురుమామిడి, మార్చి 23 : సతీష్ అన్న బాగున్నావా అంటూ కరచాలనం చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆప్యాయంగా పలకరించారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమావేశాన్ని కరీంనగర్లో ఆదివారం ఏర్పాటు చేశారు. కాగా, సభకు హాజరయ్యేందకు బయలుదేరిన కేటీఆర్కు శనిగరం స్టేజి వద్ద 50 వాహనాలతో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఘన స్వాగతం పలికారు.
కేటీఆర్ కారు దిగగానే పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కేటీఆర్ సతీష్ అన్న బాగున్నావా? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అంటూ ప్రేమగా ముచ్చటించారు. పార్టీ చేపట్టాల్సిన పలు అంశాలను చర్చించారు. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి 1000 మందికి పైగా నాయకులు సమావేశానికి వస్తున్నారని సతీష్ కుమార్ వివరించారు. సతీష్ కుమార్ పనితీరుపై కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.