KTR : ఇటీవల ఒక ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన బీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ మన్నె క్రిశాంక్‌ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. క్రిశాంక్‌తో, ఆయన కుటుంబసభ్యులతో కాసేపు ముచ్చటించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ వెంట బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు టీ పద్మారావు, సీహెచ్ మల్లారెడ్డి అన్నారు. కేటీఆర్, పద్మారావు, మల్లారెడ్డి కలిసి క్రిశాంక్‌ను పరామర్శిస్తున్న దృశ్యాలు కింది వీడియోలో ఉన్నాయి.
ఇటీవల ఓ ప్రమాదంలో గాయపడి స్వల్ప గాయాలతో చికిత్స పొంది కోలుకుంటున్న మాజీ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ @Krishank_BRS ను పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS, మాజీ మంత్రులు @TPadmaRao, @chmallareddyMLA. pic.twitter.com/W6JBosh32G
— BRS Party (@BRSparty) March 26, 2026