KTR | బీఆర్ఎస్ సీనియర్ నేత జిట్టా బాలకృష్ణా రెడ్డిని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పరామర్శించారు. గత కొద్దిరోజులగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో బాలకృష్ణారెడ్డిని పరామర్శించారు. ఆయనకు అందిస్తున్న వైద్యం వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. అదే విధంగా జిట్టా బాలకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులతోను కేటీఆర్ మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని, జిట్టా కోలుకుంటున్నారని డాక్టర్లు చెప్పారని కేటీఆర్ వారికి భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ సీనియర్ నేత అయిన జిట్టా బాలకృష్ణారెడ్డి బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేరి ఆయన నెల రోజులుగా చికిత్స తీసుకుంటున్నారు. వైద్యులు ప్రస్తుతం ఐసీయూలో ఉంచి ఫ్లూయిడ్స్ అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ నేతలు ఆరా తీస్తున్నారు.