హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): పోలీసులు తనపై నమోదు చేసిన రెండు కేసులను కొట్టేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు రెండు వ్యాజ్యాలను గురువారం దాఖలు చేశారు. సీఎం రేవంత్రెడ్డి కాంట్రాక్టర్లు, బిల్డర్ల నుంచి రూ.2500 కోట్లు వసూలు చేసి ఢిల్లీకి పంపారని ఆరోపించడంపై శ్రీనివాసరావు అనే వ్యక్తి ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారని పేర్కొన్నారు.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ముషీరాబాద్ పీఎస్లో నమోదైన కేసును కొట్టేయాలని కేటీఆర్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మరో పిటిషన్ దాఖలు చేశారు.