KTR | తెలంగాణ క్యూఆర్ కోడ్‌తో రూపొందించిన చేనేత శాలువాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. హైదరాబాద్ నందినగర్ నివాసంలో ఈ శాలువాను ఆవిష్కరించారు. అనంతరం ఈ శాలువాను నేసిన సిరిసిల్ల జిల్లాకు చెందిన నల్ల విజయ్ను అభినందించారు.
చేనేతతో ఎన్నో అద్భుతాలు సృష్టించిన సిరిసిల్ల జిల్లాకు చెందిన నల్ల విజయ్ తాజాగా.. ఒక శాలువాను రూపొందించారు. తెలంగాణ క్యూఆర్ కోడ్‌తో ఆయన ఈ శాలువాను నేశారు. ఈ శాలువాను మొబైల్‌తో స్కాన్ చేయడం ద్వారా తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు, కట్టడాలు, సంప్రదాయాలు అలాగే కేసీఆర్ చేపట్టిన మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం తెలుసుకోవచ్చు. తెలంగాణ గొప్పతనాన్ని తెలిసేలా నేసిన ఈ శాలువాను తీసుకొని నల్ల విజయ్.. హైదరాబాద్ నందినగర్‌లోని కేటీఆర్ నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా శాలువాను కేటీఆర్ ఆవిష్కరించి.. నల్ల విజయ్ను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పార్టీ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ క్యూఆర్ కోడ్‌తో రూపొందించిన చేనేత శాలువాను నంది నగర్ నివాసంలో ఆవిష్కరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
ఈ క్యూఆర్ కోడ్‌తో.. పోగు బంధంతో ఫోన్ బంధం
తెలంగాణ చరిత్రను తెలిపే శాలువాను నేసిన సిరిసిల్లకు చెందిన నేతన్న నల్ల విజయ్ కుమార్.
తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు,… pic.twitter.com/D9DoSCBijI
— BRS Party (@BRSparty) December 13, 2025