హైదరాబాద్, అక్టోబరు 8 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. సీఎం కేసీఆర్ పట్ల చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ‘ఈ లవంగం గారిని ఇలాగే వదిలెయ్యకండి రా బీజేపీ బాబులు.. పిచ్చి ముదిరి తొందర్లో కరవడం మొదలు పెడతాడేమో, మతి లేని మాటలతో సమాజానికి ప్రమాదకరంగా తయారయ్యాడు’ అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘ఎర్రగడ్డలో బెడ్ తయారుగా ఉన్నది.. తొందరగా తీసుకెళ్లి వైద్యం చేయించుకోండి’ అంటూ బీజేపీ నేతలకు చు, రకలంటించారు.
ఎన్నాళ్లీ దగా? ఇంకెన్నాళ్లీ మోసం?
గుజరాత్లో కొబ్బరి అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై మంత్రి కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. ‘గుజరాత్‌కు మరో బోర్డు, తెలంగాణకు మరో మోసం.. బోర్డులు గుజరాత్‌కు, బోడిగుండులు తెలంగాణకా? మోదీ గుండెల్లో గుజరాత్, తెలంగాణ గుండెల్లో గునపాలా? ఎన్నాళ్లీ దగా..? ఇంకెన్నాళ్లీ మోసం?’ అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.