హైదరాబాద్: దళితోద్యమ వేగుచుక్క భాగ్యరెడ్డి వర్మ (Bhagya Reddy Varma) జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఘనంగా నివాళులు అర్పించారు. దేశం గర్వించదగ్గ సంఘ సంస్కర్త అని, అంబేద్కర్ కన్నా ముందే పీడిత ప్రజల కోసం గళమెత్తిన సామాజిక ఉద్యమకారుడని చెప్పారు. వందేండ్ల క్రితమే దళిత బిడ్డలకోసం హైదరాబాద్లో 26 పాఠశాలలు నడిపిన అక్షర సూర్యుడని తెలిపారు.
మరుగునపడిన ఆ మహనీయుడిని స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఘనంగా స్మరించుకుందని చెప్పారు. భాగ్యరెడ్డి వర్మ జయంతి, వర్ధంతులను అధికారికంగా
నిర్వహించిండమే కాకుండా, ఆయన చరిత్రను పాఠ్యాంశంగా చేర్చిందన్నారు. ఆయన చూపిన బాటలో నడుస్తూ గురుకుల విద్యా విప్లవంతో బడుగు బలహీనవర్గాల బిడ్డల బతుకుల్లో వెలుగులు నింపిందని తెలిపారు.
‘‘దళిత ఉద్యమ ధ్రువ తార!
తెలంగాణ వైతాళికుడు !
అణగారిన వర్గాల ఆత్మగౌరవ దీపిక !
భాగ్యరెడ్డి వర్మ.. దేశం గర్వించదగ్గ సంఘ సంస్కర్త !
అంబేద్కర్ కన్నా ముందే పీడిత
ప్రజల కోసం గళమెత్తిన
సామాజిక ఉద్యమకారుడు!
వందేండ్ల క్రితమే దళిత బిడ్డలకోసం హైదరాబాద్లో
26 పాఠశాలలు నడిపిన అక్షర సూర్యుడు!
ప్లేగు మహమ్మారి కబళించినప్పుడు నగరంలో
గొప్ప సేవలు అందించిన ఆదర్శ సంఘ సేవకుడు !
బాల్య వివాహాలు.. జోగిని ఇతర సాంఘిక
దురాచారాల మీద పోరాడిన పాత్రికేయుడు !
దేశమంతా తిరిగి బహుభాషల్లో
భావజాల వ్యాప్తిచేసిన గొప్ప వక్త!
మరుగునపడిన ఆ మహనీయుడిని స్వరాష్ట్రంలో
బీఆర్ఎస్ ప్రభుత్వం ఘనంగా స్మరించుకుంది!
భాగ్యరెడ్డి వర్మ జయంతి..వర్ధంతులను అధికారికంగా
నిర్వహించిండమే కాదు..ఆయన చరిత్రను పాఠ్యాంశంగా చేర్చింది!
భాగ్యరెడ్డి వర్మ చూపిన బాటలో నడుస్తూ..
గురుకుల విద్యా విప్లవంతో బడుగు బలహీనవర్గాల
బిడ్డల బతుకుల్లో వెలుగులు నింపింది!
దళితోద్యమ వేగుచుక్క జయంతి సందర్భంగా
ఆయనకు ఘన నివాళులు అర్పిద్దాం!’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.