హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం తమిళనాడులోని కోయంబత్తూర్కు వెళ్లనున్నారు. అక్కడి కుమార్గురు ఇన్స్టిట్యూషన్స్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 10వ ఎఫ్ఎంఏఈ నేషనల్ స్టూడెంట్స్ మోటర్ స్పోర్ట్స్ కాంపిటీషన్-2025కు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా 101 ఇంజినీరింగ్ కాలేజీల నుంచి 70కి పైగా విద్యార్థి బృందాలు, 1300 మందికిపైగా యువ ఇంజినీర్లు పాల్గొనే ఈ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరుకావడం గర్వకారణంగా భా విస్తున్నారు.
టెక్నాలజీ ప్రోత్సాహం, మో టర్ స్పోర్ట్స్ రంగంలో కొత్త ప్రతిభను వెలికితీసే వేదికగా నిలువనున్న కార్యక్రమం లో పాల్గొని ఆయన యువ విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు.