హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తేతెలంగాణ): దేశ తొలివిద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ జయంత్యుత్సవాలను సోమవారం ఘనంగా జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సోమవారం ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ కేటీఆర్ హాజరై పేద ముస్లిం విద్యార్థులకు నోట్ బుక్స్, మెటీరియల్ పంపిణీ చేయనున్నారు.
అలాగే సీఎం రేవంత్రెడ్డి రవీంద్రభారతిలో నిర్వహించనున్న కార్యక్రమంలో కలాం స్మారక పురస్కారాలను అందించనున్నారు.