BRS Rythu Deeksha | వెల్దండ, ఫిబ్రవరి 7 : బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్‌గల్లులో ఈ నెల 13న 15వేల మందితో రైతు దీక్ష చేపడుతున్న కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నట్టు పేర్కొన్నారు.
శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 13న రైతు దీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు. రైతులు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.