హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Assembly Session) ప్రారంభమయ్యాయి. తొలిరోజు 101 మంది ఎమ్మెల్యేలు ప్రమాణం చేయగా మిగిలినవారితో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణం చేయించారు. వారిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు పద్మారావు గౌడ్, పాడి కౌశిక్‌రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు.
అనంతరం వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ అధికారికంగా ప్రకటించారు. అనంతరం స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ఆయనను స్పీకర్ చైర్ వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు కేటీఆర్, కడియం శ్రీహరితోపాటు అన్నిపార్టీలకు చెందిన సభ్యులకు స్పీకర్‌ను అభినందించారు.