హైదరాబాద్ : సింగరేణిలో(Singareni) 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును లేనిది ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ప్రశ్నించారు. గురువారం అక్రమ కేసులో అరెస్ట్ అయి చంచలగూడ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సింగరేణిలో ఇంత కుంభకోణం జరుగుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గమ్మున ఎందుకు ఉన్నాడని నిలదీశారు.
బీజేపీ నాయకుల మౌనం వెనుక ఆంతర్యమేంటన్నారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాస్తానని పేర్కొన్నారు. బాల్క సుమన్‌ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన మా పార్టీ నాయకులు, కార్యకర్తలు పోరాటం ఆపరని తెలిపారు. అన్యాయాలు, అక్రమాలపై ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును లేనిది ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది
ఇంత కుంభకోణం జరుగుతుంటే ముఖ్యమంత్రి గమ్మున ఎందుకు ఉన్నాడు
దీనిపై నేను కిషన్ రెడ్డికి లేఖ రాస్తాను
– కేటీఆర్ https://t.co/3pZOsG0W4C pic.twitter.com/Nea3SpQxOr
— Telugu Scribe (@TeluguScribe) June 4, 2026