హైదరాబాద్, మే 21(నమస్తే తెలంగాణ): వరంగల్‌లోని 2,400 పడకల ఎంజీఎం సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్ రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ దవాఖాన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ పాలనా వైభవానికి ఈ వైద్యశాల నిదర్శమని గురువారం ఎక్స్ వేదికగా అభివర్ణించారు.
మనం ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఏం సాధించవచ్చనేందుకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు.