KTR | రాష్ట్రంలో ఇన్ని హాలిడేలు ఎందుకు.. రేవంత్ రెడ్డికి హాలిడే చెబితే లొల్లిపోదా.. కేటీఆర్ సెటైర్లు
KTR | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని రంగాలు సంక్షోభంలోకి వెళ్లాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో ఇన్ని హాలిడేలు ఎందుకు? రేవంత్‌రెడ్డికి హాలిడే చెబితే రాష్ట్రానికి ప్రశాంతత వస్తుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటేనే తెలంగాణలో ప్రశాంత వాతావరణం తిరిగి వస్తుందని అన్నారు.
KTR | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని రంగాలు సంక్షోభంలోకి వెళ్లాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. క్రాప్ హాలిడే, ఫీజు రీయింబర్స్మెంట్ హాలిడే, పవర్ హాలిడే, నిర్మాణ రంగానికి హాలిడే, పరిశ్రమలకు హాలిడే, ఐటీ రంగానికి హాలిడే.. చివరకు రైతుబంధుకు కూడా హాలిడే ప్రకటించారని మండిపడ్డారు. ఆదిలాబాద్ రైతు గర్జన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఇన్ని హాలిడేలు ఎందుకు? రేవంత్‌రెడ్డికి హాలిడే చెబితే రాష్ట్రానికి ప్రశాంతత వస్తుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటేనే తెలంగాణలో ప్రశాంత వాతావరణం తిరిగి వస్తుందని అన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలని కేటీఆర్ కోరారు. ‘క్రాప్ హాలిడే, ఫీజు రీయింబర్స్మెంట్ హాలిడే, పవర్ హాలిడే, కన్స్ట్రక్షన్కు హాలిడే, ఇండస్ట్రీస్‌కు హాలిడే, ఐటీకి హాలిడే.. అన్నింటికీ హాలిడే. రైతుబంధుకు కూడా హాలిడే. మరి ఇన్ని హాలిడేలు ఎందుకు? సప్పుడేక రేవంత్‌రెడ్డికి హాలిడే చెబితే మనం లొల్లిపోదా? కేసీఆర్‌ను మళ్లీ తెచ్చుకుంటే సప్పుడేగా ఈ లొల్లి పోయి ప్రశాంతత రాదా?’ అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటుంటే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దానికి అండగా ఉంటోందని కేటీఆర్ ఆరోపించారు. ఆదిలాబాద్‌లో బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని విమర్శించారు. ‘బడే బాయ్, చోటే బాయ్ ఒక్కటయ్యారు. ఈరోజు దాని ఫలితాన్ని ఆదిలాబాద్ ప్రజలు చూస్తున్నారు. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు, బీజేపీ ఎంపీ ఉన్నాడు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇద్దరూ నోరు మెదపడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బహిరంగంగా దోపిడీ చేస్తున్నా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు’ అని అన్నారు.
ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం, హైదరాబాద్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం తమ తమ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయని ఆరోపించారు. ‘ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ప్రజలను దోచుకునే పనిలో ఉంది. హైదరాబాద్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను దోచుకోవడంలో బిజీగా ఉంది. అందుకే ఈ రెండు పార్టీలు ఒక్కటయ్యాయని చెబుతున్నా’ అని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ పాలనలో పదేళ్లపాటు తెలంగాణలో శాంతి, సోదరభావం, సంతోషకరమైన వాతావరణం ఉండేదని కేటీఆర్ అన్నారు. ఒకరి ఆచారాలు, సంప్రదాయాలను మరొకరు గౌరవించే పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు తోఫా, బతుకమ్మ సందర్భంగా మహిళలకు చీరలు, క్రిస్మస్ సందర్భంగా కానుకలు అందించేవారని చెప్పారు. ‘ఇప్పుడు బతుకమ్మ చీరలు గాయబ్.. రంజాన్ తోఫా గాయబ్.. క్రిస్మస్ గిఫ్ట్ గాయబ్. కేసీఆర్ కిట్ కూడా గాయబ్. ప్రజలకు చైన్, నిద్ర కూడా లేకుండా పోయాయి. మళ్లీ పాత రోజులు వచ్చాయి’ అని విమర్శించారు. ఓటు వేసే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ‘కేసీఆర్ చెప్పిన మాట గుర్తుంచుకోండి. ఆలోచించి ఓటు వేయండి. ఒక తప్పుడు ఓటు వేస్తే దాని శిక్ష ఐదేళ్లు అనుభవించాల్సి వస్తుంది’ అని అన్నారు.
ప్రస్తుతం ఎన్నికలు లేవని, వెంటనే ఓట్లు కూడా లేవని కేటీఆర్ అన్నారు. అయినప్పటికీ ఆదిలాబాద్‌లో రైతు గర్జన సభకు ప్రజలు పెద్దఎత్తున తరలిరావడం చూస్తుంటే ప్రభుత్వం దిగివచ్చి రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు వేస్తుందనే నమ్మకం కలుగుతోందని చెప్పారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతులను సమీకరించి వరుసగా సభలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ‘ప్రభుత్వం దిగివచ్చి రైతుల ఖాతాల్లో రైతుబంధు వేస్తుందని నాకు విశ్వాసం ఉంది. లేకపోతే మనం ఇదే పని పెట్టుకుందాం. వరుసగా సభలు పెడదాం. రైతులను కూడగడదాం’ అని అన్నారు. తెలంగాణవ్యాప్తంగా రైతులను సమీకరించి కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు.
తెలంగాణ జెండా ఎగరేద్దాం.. గులాబీ జెండా తిరిగి తెచ్చుకుందాం
తన ప్రసంగం ముగింపులో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కవి గూడ అంజన్న పాటను కేటీఆర్ గుర్తుచేశారు. ‘పుడితే ఒక్కటి.. సస్తే రెండు.. రాజిగా ఒరే రాజిగా.. ఎత్తురా తెలంగాణ జెండా రాజిగా.. ఓ రాజిగా’ అంటూ అంజన్న రాసిన పాటను ప్రస్తావించారు. ‘ఎత్తుకుందాం తెలంగాణ జెండా.. గుండెల నిండా గులాబీ జెండా ఎగరేద్దాం. గులాబీ జెండాను తిరిగి తెచ్చుకుందాం’ అంటూ పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రాష్ట్రంలో ఇన్ని హాలిడేలు ఎందుకు.. రేవంత్ రెడ్డికి హాలిడే చెబితే లొల్లిపోదా.. కేటీఆర్ సెటైర్లు
KTR | నల్లమల పిల్లికి ఎలుకలు పట్టడం కూడా చేతనైతలేదా.. రిమ్స్ ఘటనపై కేటీఆర్ ఎద్దేవా
KTR | తెలంగాణకు ప్రధాని మోదీ ఏం ఇచ్చారు.. బీజేపీకి ఎందుకు ఓటేయాలి.. బడే బాయ్ – చోటే బాయ్ బంధంపై కేటీఆర్ ఫైర్
Back Pain | వెన్ను నొప్పికి అసలు కారణాలు ఏమిటి.. ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి..
KTR | మూడు నెలల్లో పిల్లలు పుడతారా అన్న రేవంత్.. మరి మూడేళ్లయినా హామీలు ఎందుకు నెరవేర్చలేదు.. రైతు గర్జనలో నిలదీసిన కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

