KTR | బాల్క సుమన్ పొరపాటుగానే మాట్లాడాడు.. అందులో అనుమానమేదీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బాల్క సుమన్ మాటలు తప్పుగా అనిపించినప్పుడు.. రేవంత్ రెడ్డి రోత భాషపై కేసులు పెట్టరా అని ప్రశ్నించారు. కూల్చాలి.. నరకాలి అని రేవంత్ రెడ్డి కూడా మాట్లాడాడని గుర్తుచేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించి మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు కేటీఆర్ ఈ మేరకు సమాధానమిచ్చారు. బాల్క సుమన్ పొరపాటుగానే మాట్లాడాడు.. అందులో అనుమానమేదీ లేదని అన్నారు.
అసలు ఫ్యూచర్ సిటీ అనడమే తప్పు.. అది ఫ్యూచర్ సిటీ కాదు.. ఫార్మా పరిశ్రమల కోసం సేకరించిన భూమి అని మరో ప్రశ్నకు కేటీఆర్ సమాధానం తెలిపారు. భూసేకరణ చట్టం ప్రకారం భూములు దేనికి సేకరించారో దానికే వినియోగించాలని అన్నారు. రేవంత్ రెడ్డి జర్నలిస్టులకు భూమి ఇవ్వాలంటే బుద్వేల్‌లోనే ఇవ్వాలని అన్నారు.
బాల్క సుమన్ మాట్లాడిన మాటలు పొరపాటుగా మాట్లాడాడు
– కేటీఆర్ https://t.co/yMOkX5KZ9p pic.twitter.com/Uo3AVGURve
— Telugu Scribe (@TeluguScribe) June 3, 2026
తెలంగాణకు మళ్లీ ముప్పు పొంచి ఉన్నదని కేటీఆర్ తెలిపారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితేనే నిధులు ఇస్తామని ప్రధాని మోదీ అంటున్నారని పేర్కొన్నారు. నిధులు రాకపోయినా సరే మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని ఆనాడు కేసీఆర్ చెప్పారని అన్నారు. కానీ ఈనాడు రేవంత్ రెడ్డి మాత్రం మోదీ చెప్పినట్లు నడుచుకుంటున్నారని అన్నారు. ఆర్డీఎస్ఎస్లో చేరి మోటార్లకు మీటర్లు పెడుతున్నారని తెలిపారు. అవసరం లేకపోయినా రైతు డిస్కమ్‌లు ఏర్పాటు చేశారని అన్నారు. రైతు డిస్కమ్ కావాలని ఎవరు అడిగారని ప్రశ్నించారు. భారతదేశంలో ఎక్కడా లేని డిస్కమ్ తెలంగాణలో ఎందుకు అని నిలదీశారు. కొత్త డిస్కమ్ పేరుతో రైతులను ఆగం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చేది ఉచిత కరెంటు కాదు.. ఉత్తి కరెంటు మాత్రమేనని కేటీఆర్ విమర్శించారు.