KTR | హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ తిరుగులేని ఆర్థిక శక్తిగా అవతరించిందన్న విషయం మరోమారు స్పష్టమైంది. జీఎస్డీపీ, ఓన్ ట్యాక్స్ రెవె న్యూ, తలసరి ఆదాయం, విద్యుత్తు వినియోగం, వ్యవసాయ ఉత్పత్తులు ఇలా ప్రతి రంగంలో తెలంగాణను కేసీఆర్ అగ్రభాగాన నిలిపారన్న విషయం సాక్ష్యాధారాలతో నిరూపితమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందంటూ కాంగ్రెస్ చేస్తున్నవి దివాలాకోరు ఆరోపణలేనని స్పష్టమైంది. ప్రఖ్యాత ‘ఎకనమిక్ అండ్ పొలిటికల్’ వీక్లీ (ఈపీడబ్ల్యూ) ‘ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, అప్పుల నిర్వహణ, రిసోర్స్మేనేజ్మెంట్ ఇండెక్స్ సూచీలను వెల్లడించింది. ఇందులో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఆర్థిక నిర్వహణలో 2014-15 నుంచి 2022-23 వరకు దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉన్న ఈ ఇండెక్స్‌ను ఎక్స్‌లో షేర్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పసలేని ఆరోపణలపై విరుచుకుపడ్డారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి, ఆరోగ్యమంత్రి సహా కాంగ్రెస్ నేతలు చేస్తున్నవి తప్పుడు ఆరోపణలేనని ఈ దెబ్బతో తేలిపోయిందని పేర్కొన్నారు. అప్పుల నిర్వహణ ఇండెక్స్, రిసోర్సెస్ మేనేజ్మెంట్ ఇండెక్స్‌లోనూ దేశంలోనే తెలంగాణ రెండోస్థానంలో ఉన్నదని తెలిపారు. కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణతోపాటు అప్పుల విషయంలో ఎంత క్రమశిక్షణగా వ్యవహరించిందో చెప్పేందుకు ఈ గణాంకాలే నిదర్శనమని చెప్పారు. వాస్తవాలు ఇలా ఉంటే కాంగ్రెస్ నేతలు మాత్రం రాష్ట్రం దివాలా తీసిందని దిక్కుమాలిన ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
హామీల అమలు చేతకాకే దుష్ప్రచారం
అధికారమే పరమావధిగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను నెరవేర్చడం చేతకాకే కేసీఆర్‌పై కాంగ్రెస్ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నదని కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టంగా ఉందని, దివాలా తీసింది కాంగ్రెస్ నాయకుల బుర్రలేనని విమర్శించారు. కాంగ్రెస్ తన చేతకానితనాన్ని కప్పి పుచ్చుకునేందుకు పిచ్చి వాగుడుతో తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ర్టాన్ని బలోపేతం చేసిందీ బీఆర్ఎస్సే
తెలంగాణ తన సొంత ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నదని కేటీఆర్ స్పష్టం చేశారు. స్టేట్ ఓన్ టాక్స్ రెవెన్యూలో అగ్రభాగాన ఉంటూనే స్వయం పోషక రాష్ట్రంగా ఎదిగిందని వివరించారు. అప్పుల విషయంలో ఎప్పుడూ ఎఫ్ఆర్బీఎం పరిమితిని దాటకుండా ఆర్థిక క్రమశిక్షణ పాటించామని గుర్తుచేశారు. జీఎస్డీపీలో అప్పుల నిష్పత్తి తకువగా ఉన్న రాష్ట్రాల సరసన తెలంగాణ నిలిచిందనే విషయం తెలిసినా తప్పుడు ప్రచారాలతో పైశాచిక ఆనందం పొందారని విమర్శించారు. తమ ప్రభుత్వం దీర్ఘకాలిక రుణాలు తీసుకుందని, వాటిపై వడ్డీల చెల్లింపు భారం స్వల్పమేనని తెలిపారు. రెవెన్యూ వ్యయంలో వడ్డీల చెల్లింపు శాతం అతి తకువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. కేసీఆర్ చేసిన అప్పుల్లో సింహభాగం మూలధన వ్యయం చేశారని, తద్వారా ఆస్తులు, సంపద సృష్టి జరిగిందని వివరించారు.
కేసీఆర్ హయాంలో అద్భుతాలు
తెలంగాణ కన్నా అనేక దశాబ్దాల ముందు ఏర్పడి, పెద్ద రాష్ర్టాలుగా ఉన్నవాటిని తలదన్నేలా రాష్ట్రం ఎదగడం అద్భుతమని కేటీఆర్ పేర్కొన్నారు. దేశాన్ని పోషించే ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలవడం కేసీఆర్ కృషితోనే సాధ్యమైందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అత్యంత సమర్థంగా నిర్వహించడం వల్లనే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇండెక్స్‌లో నంబర్‌వన్‌గా ఉన్నామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేసినందుకు కాంగ్రెస్ నాయకులు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఎంతో కష్టపడి గాడినపెట్టిన ఆర్థిక వ్యవస్థను చేతకాని విధానాలతో నాశనం చేయొద్దని హితవు పలికారు.
అయినా తప్పుడు ప్రచారాలే
కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ పలుమార్లు పక్కా లెక్కలతో అసెంబ్లీలోనే వాస్తవాలను వెల్లడించిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. ఆర్బీఐ, కాగ్, ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి నివేదికలు, ఆర్థిక వేత్తల విశ్లేషణలన్నీ తెలంగాణ ఆర్థిక పరిపుష్టిని పదేపదే నిరూపించినా తప్పుడు ప్రచారాలు చేయడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రచురించిన సామాజిక, ఆర్థిక నివేదికలో సైతం పదేండ్ల తెలంగాణ ఆర్థిక సత్తాను కండ్లకు కట్టే గణాంకాలను చెప్పక తప్పని వైనాన్ని ఆయన ఉదహరించారు. కండ్ల ముందు అన్నీ కనిపిస్తున్నా కాంగ్రెస్ పార్టీ క్షమించారని రీతిలో తప్పుడు ప్రచారం చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ పదేండ్ల పాలనపై ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా చివరికి సత్యమే గెలుస్తుందని స్పష్టం చేశారు.
కేసీఆర్ పాలనలో తెలంగాణ బంగారు తునక అయ్యింది. ఇక్కడ ఎకరం కొనాలంటే ఆంధ్రాలో పదెకరాలు అమ్ముకోవాలని పొరుగురాష్ర్టాలే ఆశ్చర్యపోయిన సందర్భాలు కోకొల్లలు. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదిగింది. భూమి విలువ పెరిగింది. కానీ గత పది నెలల్లో రియల్టీ రంగం నేలకరుచుకుపోయింది. స్థలాలు కొనేవారు, అమ్మేవారు లేరు. ప్రాజెక్టులు ఆగిపోయాయి. ఆదాయం పడిపోయింది.
సమైక్య ఏలుబడిలో పడావుపడిన తెలంగాణ.. పదేండ్లలో అన్నపూర్ణగా ఎదిగింది. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచింది. ఇక్కడి సాగు విధానాలు, రైతు పథకాలు దేశానికే మాడల్‌గా నిలిచాయి. మరి నేడు!? విత్తనాల కోసం క్యూలు, ఎరువుల కోసం ఎదురుచూపులు! భరోసా లేదు.. బీమా అందదు.. రుణమాఫీ పూర్తికాదు! పంట పోతే పరిహారం రాదు, దిగుబడి వస్తే కొనే దిక్కులేదు!
కేసీఆర్ ప్రభుత్వ విధానాలు, ఆర్థిక క్రమశిక్షణ, వనరుల సద్విని యోగంతో సుసంపన్న రాష్ట్రంగా ఎదిగింది. జీడీపీ వృద్ధిరేటులో దేశంలోనే టాప్‌లో నిలిచింది. మరి ఇప్పుడు? కాంగ్రెస్ పాలనలో వృద్ధి మందగించింది. పైగా 75వేల కోట్ల అప్పు చేసిన సర్కార్.. బకాయిలు చెల్లించిందీ లేదు. కొత్త ప్రాజెక్టు చేపట్టిందీ లేదు.
ఈపీడబ్ల్యూ సంచికలో పేర్కొన్న సాధారణ రాష్ర్టాల్లో అప్పుల నిర్వహణ సూచీ, జాతీయ ర్యాంకింగ్ ఇలా