KTR | హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉపఎన్నికలు తప్పవని, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తామని బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు హెచ్చరించారు. ఒకవైపు జాతీయ స్థాయిలో పార్టీ ఫిరాయింపులపై సుద్దులు చెప్తూ తెలంగాణలో మాత్రం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నదని మండిపడ్డారు. త్వరలోనే కోర్టుల సహాయంతో కాంగ్రెస్‌కు సరైన గుణపాఠం చెబుతామని పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలోని పలువురు ప్రముఖ న్యాయకోవిదులతో, రాజ్యాంగ నిపుణులతో పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆధ్వర్యంలో నాయకుల బృందం చర్చలు జరిపింది.
ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపుల విషయంలో ఇప్పటికే మణిపూర్ ఎమ్మెల్యేకు సంబంధించిన కేసుతో సహా పలు కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిందని రాజ్యాంగ నిపుణుడు చెట్పట్ ఆర్యమాసుందరం పార్టీ బృందానికి వివరించారు. గతంలో మాదిరిగా అనర్హత వేటు విషయంలో సుదీర్ఘకాలం నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ నాన్చలేరని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్‌తోపాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన విషయాన్ని, వాటికి సంబంధించిన పత్రాలను న్యాయ నిపుణులకు బీఆర్ఎస్ నేతలు అందజేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నందున హైకోర్టు సైతం ఎకువ కాలం వాయిదా వేసే అవకాశం లేదని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. హైకోర్టు నిర్ణయం త్వరగా ప్రకటించకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నదని చెప్పారు.
ప్రజాక్షేత్రంలో బుద్ధిచెప్తాం
సుప్రీంకోర్టు తీర్పులతోపాటు న్యాయ కోవిదులు, రాజ్యాంగ నిపుణులు చెప్తున్న సలహాలు, సూచనల మేరకు న్యాయపోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ తెలిపారు. నెలలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం తేలిపోతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. రాజ్యాంగ నిపుణులు, న్యాయ కోవిదులతో జరిగిన సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు వద్ధిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.