చుంచుపల్లి, సెప్టెంబర్ 04 : భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన అండర్–13, 15 సబ్ జూనియర్స్ సాఫ్ట్‌బాల్ అంతర్జిల్లా పోటీలకు క్రీడాకారుల ఎంపికలను శుక్రవారం నిర్వహించినట్లు జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ నిర్వాహకులు తెలిపారు. కొత్తగూడెంలోని శ్రీ రామాంజనేయ నగర్ కాలనీలోని సెయింట్ జేవియర్ హైస్కూల్లో ఉదయం 9 గంటలకు ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ ఎంపిక పోటీలను మాజీ ఎంఈఓ బాలాజీ, సెయింట్ జేవియర్ హైస్కూల్ ప్రిన్సిపల్ బాలస్వామి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, వీఎం బంజర, భద్రాచలం, టేకులపల్లి, కొత్తగూడెం తదితర ప్రాంతాల నుంచి సుమారు 120 మంది క్రీడాకారులు హాజరై తమ ప్రతిభను ప్రదర్శించారు. 32 మంది బాలికలను బాలుర విభాగంలో 32 మందిని ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మొత్తం నాలుగు విభాగాల్లో 64 మంది క్రీడాకారులను ఎంపిక చేసామన్నారు.
ఎంపికైన క్రీడాకారులు బెల్లంపల్లిలో ఈ నెల 11, 12, 13వ తేదీలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని నిర్వాహకులు తెలిపారు. జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ.మధుకర్, ప్రధాన కార్యదర్శి కె.నవీన్‌కుమార్, కోశాధికారి వి.వి.జి. కృష్ణ ఆధ్వర్యంలో జిల్లా కోచ్ పొన్నాల పృధ్విరాజ్ ఎంపిక ప్రక్రియను నిర్వహించారు. క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు.

కొత్తగూడెంలో అండర్–13, 15 సబ్ జూనియర్స్ సాఫ్ట్‌బాల్ ఎంపికలు