వైరా టౌన్, సెప్టెంబర్ 04 : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, గిరిజన డిక్లరేషన్ను తక్షణమే అమలు చేయాలని సేవాలాల్ సేన ఖమ్మం జిల్లా అధ్యక్షుడు భూక్యా నరసింహా నాయక్ డిమాండ్ చేశారు. శుక్రవారం వైరాలో నిర్వహించిన జిల్లా జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
– కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం గిరిజన డిక్లరేషన్ను వెంటనే అమలు చేయాలి
– ప్రైవేట్ వర్సిటీల్లో రిజర్వేషన్లు: ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీల్లో SC, ST, BC, మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించాలి
– నిబంధనలు ఉల్లంఘించే వర్సిటీల గుర్తింపు రద్దు చేయాలి
- నూతన గ్రామ/తండా పంచాయతీలను రెవెన్యూ పంచాయతీలుగా గుర్తించి నిధులు కేటాయించాలి.
- రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్ పిలుపు మేరకు సెప్టెంబర్ 9న సేవాలాల్ సేన ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా, మండల, తండా స్థాయిల్లో ఘనంగా నిర్వహించాలి.
ఈ సమావేశంలో సేవాలాల్ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ రాథోడ్, ఉపాధ్యక్షుడు దేవేందర్ నాయక్, కార్యదర్శి చందునాయక్, మండల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.