7 రోజుల్లో బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి
కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు మంగళవారం లీగల్ నోటీస్ పంపారు. ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో సంజ య్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, నిరాధారమైనవని, తన ప్రతిష్ఠను దిగజార్చే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారని లీగల్ నోటీసులో కేటీఆర్ పేరొన్నారు.
- లేకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు తప్పవు
- కేంద్రమంత్రి హోదాలో ఉండి మరో ప్రజాప్రతినిధిపై అబద్ధపు ప్రచారం
- మళ్లీ అసత్య ఆరోపణలు చేయొద్దు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిరాధార ఆరోపణలపై లీగల్ నోటీసులు
హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు మంగళవారం లీగల్ నోటీస్ పంపారు. ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో సంజ య్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, నిరాధారమైనవని, తన ప్రతిష్ఠను దిగజార్చే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారని లీగల్ నోటీసులో కేటీఆర్ పేరొన్నారు. ఈ మేరకు కేటీఆర్‌కు బండి సంజ య్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని, కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై భవిష్యత్తులో కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎటువంటి దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని ఆ నోటీసులో డిమాండ్ చేశారు.
నోటీస్ అందిన 7 రోజుల్లోగా ఈ డిమాండ్లను పాటించని పక్షంలో, చట్టపరంగా సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఆరోపణల వల్ల కలిగిన నష్టానికి బండి సంజయ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని నోటీస్‌లో స్పష్టంచేశారు. ఈ నెల 8న బండి సంజయ్ మీడియా సమావేశంలో నిరాధారమైన, దురుద్దేశ పూరితమైన ఆరోపణలు చేశారని కేటీఆర్ తరఫు న్యాయవాదులు ఆ నోటీసులో పేరొన్నారు. బండి సంజయ్ తన హోదాను దుర్వినియోగం చేస్తూ, ప్రజల్లో కేటీఆర్ ప్రతిష్ఠను దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కేవలం రాజకీయంగా వార్తల్లో నిలిచేందుకు సంజయ్ పదేపదే అడ్డగోలుగా ప్రాపగండా చేస్తున్నారని ఆక్షేపించారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల వల్ల కేటీఆర్ ప్రతిష్ఠకు భంగం కలిగిందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోపాటు ఆ తర్వాత మంత్రిగా అనేక రంగాల్లో అద్భుతమైన సేవలు అందించారని గుర్తుచేశారు.
వ్యక్తిగత ఆరోపణలతో పరువుకు భంగం
కేటీఆర్‌పై బండి సంజయ్ పదేపదే చేస్తున్న వ్యక్తిగత ఆరోపణలతో తన క్లయింట్ కేటీఆర్ పరువుకి భంగం కలుగుతుందని లీగల్ నోటీస్‌లో న్యాయవాదులు పేర్కొన్నారు. మీడియా సమావేశంలో బండి చేసిన ఏ వ్యాఖ్యలకు కూడా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఒ శాసనసభ్యుడిపైన అసత్యపూరిత అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం అభ్యంతరకరమని తెలిపారు. బండి సంజయ్ ఆరోపణలకు ఎలాంటి ఆధారం లేదని, ఇవి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే చేశారని బండి సంజయ్‌కు పంపిన నోటీస్‌లో కేటీఆర్ తరఫు న్యాయవాదులు స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Bandi Sanjay
- BJP
- KTR
- Legal Notice
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

