KTR | హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ రథసారథి కేసీఆర్.. చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన నాయకుడు అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
ఆంగ్ల నూతన సంవత్సరం మొదటి రోజున తెలంగాణ భవన్కు విచ్చేసి బీఆర్ఎస్ నాయకత్వం మొత్తం ఇక్కడ కొలువుదీరి బీఆర్ఎస్ క్యాలెండర్ను ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉంది. మనందరం మనస్ఫూర్తిగా కాంక్షిస్తున్నది ఒక్కటే.. చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే ఒకే ఒక్క కోరితో గట్టిగా పని చేస్తున్నాం. కేసీఆర్ నాయకత్వంలో మన పార్టీ మరిన్ని విజయాలు నమోదు చేయాలని, ప్రజల ఆశీస్సులు పూర్తిస్థాయిలో తిరిగి పొందాలని, మనకు ఎదురయ్యే అడ్డంకులు ఎదుర్కొనే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని, మీ కుటుంబాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. కులమతాలకు అతీతంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ దేశం, రాష్ట్రం ఎల్లవేళలా ప్రశాతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా కేటీఆర్కు గులాబీ శ్రేణులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ చేత కేటీఆర్ కేక్ కట్ చేయించారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎంపీ సురేశ్ రెడ్డి, మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, మహముద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావుతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Revanth Reddy | సర్కారువారి అప్పు మరో 409 కోట్లు.. రూ.1,38,117 కోట్లకు చేరిన రేవంత్ సర్కార్ అప్పు
Industrial Park | అసైన్డ్ భూముల్లో ఇండస్ట్రియల్ పార్క్.. తిమ్మాపూర్లో 567 ఎకరాల సేకరణకు చర్యలు