KTR : మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్ (KTR) సంతాపం ప్రకటించారు. ముద్రగడ మరణవార్త తనన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఏక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు కేటీఆర్. ఆయన మరణం సామాజిక ఉద్యమాలకు తీరని లోటు అని కేటీఆర్ తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా, మంత్రిగా ముద్రగడ పద్మనాభం ప్రజలకు విశిష్ట సేవలందించారని కేటీఆర్ వెల్లడించారు. కాపు సామాజిక వర్గ హక్కుల సాధన కోసం పోరాడిన నేతగా ఆయన నిలిచిపోతారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు పేర్కొన్నారు.

‘ముద్రగడ మరణం తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు, ముఖ్యంగా సామాజిక ఉద్యమాలకు తీరని లోటు. ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, అనుచరులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నా’ అని కేటీఆర్ ఎక్స్ పోస్ట్ పెట్టారు.