హైదరాబాద్: తెలంగాణలో హిందూ, ముస్లింల సహృద్భావం దేశానికే ఆదర్శంగా నిలిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో గంగాజమున తెహజీబ్ పాలన సాగిందని చెప్పారు. ఒకరినొకరు గౌరవించుకునే, సంస్కరించుకునే మంచి వాతావరణం ఉండేదని తెలిపారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గురుకులాలు ఏర్పాటు చేసి మైనారిటీ పిల్లల దశను మార్చారన్నారు. మైనార్టీ విద్యార్థులను ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దారని చెప్పారు.
గత ప్రభుత్వంలో 2751 మంది విద్యార్థులకు రూ.20 లక్షల చొప్పున స్కాలర్షిప్ ఇచ్చామని వెల్లడించారు. నాంపల్లి అనీస్ ఉల్ గుర్బా అనాథ శరణాలయానికి రూ.200 కోట్ల విలువైన 2 ఎకరాల భూమి ఇచ్చామని గుర్తుచేశారు. రూ.37 కోట్లతో ఆధునిక భవనాలు నిర్మించి ఇచ్చామని చెప్పారు. మైనార్జీ సంక్షేమానికి రూ.10 వేల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా షాదీ ముబారక్ పథకం చేపట్టామన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇమాం, మౌజమ్‌లకు నెలకు రూ.5 వేలు ఇచ్చామని చెప్పారు. మహమూద్ అలీని తెలంగాణకు తొలి డిప్యూటీ సీఎంను చేశామని వెల్లడించారు. వరంగల్‌కు తొలిసారి ముస్లింకు డిప్యాటీ మేయర్ ఇచ్చామని తెలిపారు. మొహబ్బత్ కా దుఖాన్ అంటూ కాంగ్రెస్ సర్కార్ మైనార్టీ పేదలపై విరుచుకుపడుతున్నదని విమర్శించారు. మూసీ వెంట మైనార్టీల ఇండ్లను కూలుస్తున్నదని మండిపడ్డారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని మోసం చేసిందన్నారు. మైనార్టీ బడ్జెట్ రూ.4 వేల కోట్లు పెడతామని మోసం చేశారని, మైనార్టీలకు ప్రత్యేక సబ్‌ప్లాన్ తెస్తామని మాట తప్పారన్నారు.
ముస్లిం విద్యార్థులకు కేసీఆర్ ఉత్తమ విద్య అందించారని మాజీ మంత్రి మహమూద్ అలీ అన్నారు. లక్షల మంది మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేశారని చెప్పారు. విదేశీ చదువులకు రూ.20 లక్షల చొప్పున ఇచ్చారని తెలిపారు.
Live: Birth anniversary celebrations of Maulana Abul Kalam Azad at Telangana Bhavan.@KTRBRS
https://t.co/G4cEK1lrJ5— BRS Party (@BRSparty) November 11, 2024