KTR : పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ సెలెబ్రేషన్స్ జరుపుకోబోతున్నామని, ఈ రజతోత్సవంలో ఏడాదిపాటు బ్రహ్మాండంగా కార్యక్రమాలు ఉంటయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కరీంనగర్లో పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, హైదరాబాద్‌లో రజతోత్సవ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
‘తెలంగాణ ఉద్యమం మొదలు, అధికార పార్టీగా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ సాధించిన విజయాల వరకు ఈ తరం పిల్లలకు తెలిసే విధంగా శిక్షణా శిబిరాలు ఉంటయ్. ఫొటో ఎగ్జిబిషన్లు ఉంటయ్. డాక్యుమెంటరీలు ఉంటయ్. ఏడాది మొత్తం అదే పని ఉంటది. ఏప్రిల్ 27న వరంగల్‌కు లక్షలాదిగా అందరం తరలిపోవాల్సి ఉంటది. సాయుధ పోరాటంలో సుద్దాల హన్మంతు తన పాట ద్వారా చెప్పినట్టు బండెనక బండిగట్టి ఏ బండి దొరికితే ఆ బండ్లె వరంగల్‌కు రావాలె. దేశం మొత్తం నివ్వెరపోయే విధంగా సభ జరగాలె. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని మాట్లాడే సన్నాసుల నోరు మూయించే విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలె. ప్రతి నియోజవర్గానికి రాష్ట్ర పార్టీ నుంచి పరిశీలకులు, సమన్వయకర్తలు వస్తరు. వాళ్లు మీరు ఏంజేయాలో చెప్తరు.’ అని కేటీఆర్ చెప్పారు.