హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ ) : గిరిజన హక్కుల కోసం పోరాడిన దొడ్డి కొమురయ్య ఆశయ సాధనకు కృషి చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కొమురయ్య చూపిన మార్గంలో పేదలకు అండగా ఉంటామని చెప్పారు. గురువారం తెలంగాణ భవన్లో కొమురయ్య జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు గంగుల కమలాకర్, జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, దేవీప్రసాద్, కిశోర్‌గౌడ్, పటోళ్ల కార్తీక్ రెడ్డి, జాన్సన్‌నాయక్, మన్నె గోవర్ధన్ తదితరులు కొమురయ్య చిత్రపటానికి నివాళులర్పించారు.