KTR | ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఓడగొట్టడమే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కేటీఆర్ సమక్షంలో బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన మోరీల్ శ్రీనివాస్ రావు, పలువురు నాయకులు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ. గతంలో బాన్సువాడలో గులాబీ జెండాను ఎగురవేశాం. పెద్దాయన పోచారంను గెలిపిస్తే పోయి పోయి మునిగిపోయే పడవ కాంగ్రెస్ పార్టీలో చేరిండని ఎద్దేవా చేశారు. ఆయన కాంగ్రెస్‌లో చేరి కుడిదిలో పడ్డ ఎలుకలా గిలగిలా కొట్టుకుంటున్నడు.
ఈ వయసులో ఇంత అవస్థ అవరమా?
కక్కలేక మింగలేక ఇబ్బంది పడుతున్నాడు. నిన్న మొన్నటి వరకు స్పీకర్‌గా చేసిన ఆ పెద్ద మనిషికి తాను ఏ పార్టీలో ఉన్నానో కూడా చెప్పు్కోలేని పరిస్థితులో ఉన్నాడు. ఈ వయసులో ఇంత అవస్థ అవరమా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఇచ్చిన నిధులతో అభివృద్ధి పనులు చేయించుకొని ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్లోనే ఉంటానని చెప్పారు. పోచారం దేవుని మీద ఒట్టేసి మాట తప్పిండు. రేవంత్ రెడ్డి ఒక్కడే దేవుడి మీద ఒట్టేసి మోసం చేస్తడు అనుకున్నాం. కానీ, పోచారం కూడా మోసం చేశాడన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు ఓ చిచోరాగాడు, ఎప్పుడు ఏం మాట్లాడుతాడో తెలియదు. ఖర్మగాలి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండని ఆవేదన వ్యక్తం చేశారు.
మూటలు మోసుడే రేవంత్‌కు సరిపోతుంది
ఢిల్లీకీ మూటలు మోసుడే రేవంత్‌కు సరిపోతుందన్నారు. దోచుకున్నది రాహుల్‌కు అప్పజెప్పాలి తిరిగి రావాలి. ఆయనకు అది తప్ప మరేం తెలువదన్నారు. రెండున్నరేండ్లలో ఆయన చేసింది ఏమీ లేదన్నారు. మైక్ దొరికితే చాలు కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడని విమర్శించారు. ఎక్కడికి వెళ్తే అక్కడి దేవుళ్ల మీద ఒట్టేసి రుణమాఫీ చేస్తానని మోసం చేశాడన్నారు. రేవంత్ మాటలు కోటలు దాటినయ్ మాటలు గడప దాటలేదన్నారు. కానీ, కేసీఆర్ పాలనలో రైతులు సల్ల కదలకుండా పనులు అయ్యేవన్నారు. ఎరువులు, విత్తనాలు, యూరియా అన్నీ అందుబాటులో ఉండేవని గుర్తు చేశారు. ఆటోకు ఒక్క ఫోన్ చేస్తే నాడు యూరియా పొలం కాడికి వచ్చేంది.
కాంగ్రెస్ పాలనలో యాప్‌లో తీసుకొచ్చి రైతులను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. కరెంట్ సరిగా లేదు. కనీసం ధాన్యం నింపేందుకు సంచులు కూడా లేవని ఢీల్లీకి మాత్రం నగదు సంచులు మోస్తున్నాడని ఎద్దేవా చేశారు. కల్లబొల్లి మాటలు చెప్పి కాంగ్రెస్ మళ్లీ గెలువాలని చూస్తున్నది. రుణమాఫీ చేయని ఆ పార్టీకి ఓట్లతో బుద్ధి చెప్పాలన్నారు. మళ్లీ బాన్సువాడలో గులాబీ జెండా ఎగురడం ఖాయమని ఎవరు అధైర్యపడొద్దన్నారు. అదను చూసి కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాలని పిలునిచ్చారు.
LIVE: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS సమక్షంలో బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన మోరీల్ శ్రీనివాస్ రావు మరియు పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరే కార్యక్రమంhttps://t.co/Il5qFreFAi
— BRS Party (@BRSparty) July 20, 2026