KTR : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలన కారణంగా ఆర్థికంగా చితికిపోయి రైతులు, ఆటోడ్రైవర్లతోపాటు వివిధ వర్గాలకు చెందిన వారు నిత్యం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా కవితాత్మంగా, తీవ్రంగా స్పందించారు. రోజుకో చావుతో తెలంగాణ తెల్లారుతోందని, కాంగ్రెసోడి కుట్రలకు బలైపోతున్నదని మండిపడ్డారు.
రాజ్యహింసతో రాష్ట్రం నిత్యం తల్లడిల్లుతోందని, గాయాలతో గోడుగోడునా విలపిస్తోందని విమర్శించారు. రైతు రారాజుగా బ్రతికిన తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు నిత్యకృత్యమాయెనని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధికి చిరునామాగా మారిన రాష్ట్రంలో జీవనోపాధి కరువై బడుగులు బలిపీఠం ఎక్కవట్టెనని ఆయన వాపోయారు. ఇది ఎవడు చేసిన పాపమని, ముమ్మాటికీ మార్పు తీసుకొచ్చిన శాపమేనని పేర్కొన్నారు.
తన పోస్టుకు ఓ రైతు, ఓ ఆటోడ్రైవర్ ఆత్మహత్యలకు సంబంధించిన పేపర్ క్లిప్పింగ్‌లను జతచేశారు.
రోజుకో చావుతో తెలంగాణ తెల్లారుతోంది
కాంగ్రెసోడి కుట్రలకు బలైపోతుంది!రాజ్యహింసతో నిత్యం తల్లడిల్లుతోంది
గాయాలతో గోడుగోడునా విలపిస్తోంది!రైతు రారాజుగా బ్రతికిన తెలంగాణలో…
అన్నదాతల ఆత్మహత్యలు నిత్యకృత్యమాయే!ఉపాధికి చిరునామాగా మారిన రాష్ట్రంలో..
జీవనోపాధి కరువై బడుగులు… pic.twitter.com/KPHWnAg7PN— KTR (@KTRBRS) November 19, 2024