సూర్యాపేట: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సూర్యాపేటకు చేరుకున్నరు. హైదరాబాద్ నుంచి హైవే మీదుగా పేటకు చేరుకున్న కేటీఆర్‌కు దారి పొడవున అడుగడుగునా మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. సూర్యాపేటలో వేలాది బైకులతో కేటీఆర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. పట్టణంలో ర్యాలీతో ముందుకు సాగుతున్నారు. మరికాసేపట్లో పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సిల్వర్‌జూబ్లీ వేడుకల విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డితోపాటు ముఖ్యనాయకులు పాల్గొంటారు.