IndiGo | దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గత ఐదు రోజుల నుంచి ఎయిర్‌పోర్టులు అన్ని రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల కంటే అధ్వాన్నంగా మారిపోయాయని విమర్శించారు. కొంతమంది చేతుల్లోనే శక్తి కేంద్రీకృతమైతే జరిగే దుష్పరిణామాలకు ఇది గొప్ప ఉదాహరణ అని పేర్కొన్నారు.
ఇండిగో విమానాలను ఆపేయడంతో ఎయిర్‌పోర్టుల్లో వేలాది మంది తన్నుకునే పరిస్థితి వచ్చిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఇండిగో ఎందుకు బంద్ పెట్టిందో కారణాన్ని ఆయన వివరించారు. శ్రమ దోపిడీ చేయవద్దని.. పైలట్లు వారానికి ఇంత సమయం మాత్రమే విమానాలు నడపాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఏడాది కింద ఒక రూల్ తీసుకొచ్చిందని తెలిపారు. కానీ దేశంలోని విమానయాన శాఖ మొత్తం ఇండిగో, ఎయిరిండియా చేతుల్లోనే ఉందని.. దీంతో ఏడాది కింద కేంద్ర ప్రభుత్వం రూల్ తీసుకొచ్చినప్పటికీ వాళ్లు మారలేదని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయం కూడా ఏర్పాటు చేసుకోలేదని చెప్పారు. దీనివల్ల ఒక్కరోజే ఇండిగో సంస్థ వెయ్యి విమానాలు రద్దు చేయాల్సి వచ్చిందన్నారు. ఆ దెబ్బతో ఎయిర్‌పోర్టులు అన్ని అధ్వాన్నంగా తయారయ్యాయని చెప్పారు. ఎయిర్‌పోర్టులు బస్టాండ్లలా మారిపోయాయని విమర్శించారు.
విమానయాన శాఖ మొత్తం ఇద్దరి చేతుల్లోనే ఉండటంతో కేంద్ర ప్రభుత్వమే తగ్గాల్సి వచ్చిందని కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం రూల్ తీసుకొచ్చినప్పటికీ.. ఇండిగో సంస్థ తన నిర్ణయాన్ని మార్చుకోలేదని తెలిపారు. తప్పు చేశానని ఒప్పుకోలేదని.. అయినప్పటికీ వారికి ఫైన్ వేసే దమ్ము లేదని అన్నారు. చివరకు కేంద్ర ప్రభుత్వమే తగ్గి గతంలో ఇచ్చిన రూల్‌ను వెనక్కి తీసుకుందని.. విమానయాన కంపెనీలకు కొంత సమయం ఇచ్చిందని పేర్కొన్నారు. కొంతమంది చేతుల్లోనే శక్తి ఉంటే జరిగే దుష్పరిణామాలకు ఇదొక గొప్ప ఉదాహరణ అని తెలిపారు. పోర్టులు, సీపోర్టులు ఇలా అన్ని ఒకరి చేతిలోనే ఉంటే.. ఒకరు మునిగినప్పుడు అందరూ మునగాల్సి వస్తుందని చెప్పారు.
భారతదేశ విమానయానం మొత్తం ఇండిగో, ఎయిర్ ఇండియా ఇద్దరి చేతిలోనే ఉండిపోయింది
గత 5 రోజుల నుండి ఎయిర్‌పోర్ట్‌లు అన్ని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్ల కంటే అధ్వానంగా మారినాయి
కొంతమంది చేతుల్లోనే శక్తి కేంద్రీకృతం అయితే జరిగే దుష్పరిణామాలకు గొప్ప ఉదాహరణ ఇది
శ్రమ దోపిడి చేయొద్దు,… https://t.co/xIC2cQJeDW pic.twitter.com/4JHCSiqUvt
— Telugu Scribe (@TeluguScribe) December 6, 2025